
ఆ కాంట్రాక్టర్ కిడ్నాప్ డ్రామా ఆడారా!
ఇటీవల అసోంలో మహేశ్వరరెడ్డి అనే జిల్లావాసిని బోడో తీవ్రవాదులు అపహరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న వైనానికి,బోడో తీవ్రవాదుల పద్దతులకు తేడా కనిపించడంతో పోలీసులు జాగ్రత్తగా ట్రాక్ చేసి అసలు విషయం ఛేదించారు.
మహేశ్ రెడ్డి కాంట్రాక్టర్ కిడ్నాప్ డ్రామా ఆడారన్న విషయం బహిర్గతం అయింది.కిడ్నాప్ డ్రామా ఆరంభించిన మహేశ్ పాట్నాకు రైలులో వెళ్లిపోయారట. ఆయన పాట్నా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాక ఆయన ఎపిలోని తన ఇంటికి ఫోన్ చేసి తాను కిడ్నాప్ కు గురి కాలేదని చెప్పారని కూడా తెలుసుకున్నారు.
ఇంతకీ ఈడ్రామాకు కారణం ఏమిటంటే మహేశ్ రెడ్డి అసోంలో నిర్మిస్తున్న రోడ్డు కాంట్రాక్టులో నష్టం వస్తోందట.ఆయన ఇప్పటికే కాశ్మీర్ లో నష్టపోయారు.దాంతో కాంట్రాక్టు ఆలస్యం అవుతోంది.ఈ నేపధ్యంలో జాతీయ రహదారుల సంస్థ నుంచి మరింత సమయం పొందేందుకు ఈ డ్రామా ఆడారని అంటున్నారు.