కల్లు గుడిసెల కాడ – జానపదగీతం

    కల్లు గుడిసె (చిత్రం ఐఐటి కాన్పూర్ వెబ్ సైట్ నుండి స్వీకరించబడినది)

    కల్లు గుడిసెల కాడ – జానపదగీతం

    వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల పడినాడు. వాడి (దు)స్థితిని జానపదులు హాస్యంతో కూడిన ఈ జట్టిజాం పాటలో ఎలా పాడుకున్నారో చూడండి.

    వర్గం: జట్టిజాం పాట

    పాడటానికి అనువైన రాగం: శంకరాభరణం స్వరాలు (తిశ్ర ఏకతాళం)

    కల్లు గుడిసెల కాడ – కల్లు గుడిసెల కాడ
    కయిలాసం పోతాండ్య కొన్నాల్లూ

    కల్లు తాగి వాడింటికీ వచ్చాంటే
    పెండ్లాము తన్నింది కొన్నాల్లూ

    చదవండి :  చెక్కభజన

    దొరల సిగిరేటులు – దమిడగ్గి పెట్టెలూ
    జోరూగ కాల్సినాడు – కొన్నాల్లూ
    జోరుగీరూ బోయి – గంగలో పడతాంటే
    తుంట బీడీల్ కాల్చె – కొన్నాల్లూ

    మాదారం పంచెలూ – మల్లెపూ జుబ్బాలు
    జోరూగ తొడిగినాడు – కొన్నాల్లూ
    జోరుగీరూ బోయి – గంగలో పడతాంటే
    పుట్ట గోసెలు పెట్టె కొన్నాల్లూ

    సన్నొడ్ల కూడూ – కందిబ్యాల్ల ముద్దపప్పు
    జోరూగ తిన్న్యాడు – కొన్నాల్లూ
    జోరుగీరూ బోయి – గంగలో పడతాంటే
    మసిగోకడ నీళ్ళు కొన్నాల్లూ

    చదవండి :  రాయలసీమ జానపదం - తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

    కొప్పూన పూలు పెట్టి – సుట్టపూరాలుతో
    జోరూగ ఉన్న్యాడు – కొన్నాల్లూ
    జోరుగీరూ బోయి – ఇంటికీ రాంగానే
    పిల్లోల్లు తన్యారు – కొన్నాల్లూ

    పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *