సింగారరాయుడ
ప్రొద్దుటూరు చెన్నకేశవుడు

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన

ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన

ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ఇక్కడి పాత మార్కెట్ దగ్గర ఉన్న పురాతన మహాలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  పొద్దుటూరు చెండ్రాయుని (చెన్నకేశవుని) యెడల తన మధుర భక్తిని శృంగార సంకీర్తనా రూపంలో అన్నమాచార్యుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు…

చదవండి :  కప్పురమందుకొంటిఁ గడపరాయ - అన్నమయ్య సంకీర్తన

వర్గం : శృంగార సంకీర్తన
రాగము: శుద్దవసంతం
రేకు: 0191-1
సంపుటము: 7-537

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు
వొరసేరింతులు పొదటూరి చెన్నరాయా ॥పల్లవి

దగ్గరి కొలనిదరి తరుణులెల్లాఁగూడి
సిగ్గులఁ జాఁచేరదివో చేతులు నీపై
వెగ్గళించి కన్నుల వెడనవ్వులు నవ్వుతా
వొగ్గేరు వలపు పొదటూరి చెన్నరాయా ॥కరుణించ

తొల్లి నోఁచిననోములు తోడనిట్టే పలియించె
వల్లెగా నీపొందులకు వచ్చివున్నారు
చల్లలమ్మే మాటలనే సరసములాడేరు
వుల్లములలర పొదటూరి చెన్నరాయా ॥కరుణించ

చదవండి :  ఏమి నీకింత బలువు - పెదతిరుమలయ్య సంకీర్తన

చీరలు నీవియ్యఁగాను చేకొని కాఁగలించిరి
మేరతో శ్రీ వెంకటాద్రిమీఁదనే నిన్ను
గారవించి యిందునందు కందువలు మెరసిరి
వూరటగా నీకుఁ బొదటూరి చెన్నరాయా ॥కరుణించ

ఇదీ చదవండి!

షాది

షాదీ (కథ) – సత్యాగ్ని

‘‘అస్సలాము అలైకుమ్‌.’’‘‘వా అలైకుమ్‌ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: