కదంతొక్కిన విద్యార్థులు

సీమలో రాజధాని ఏర్పాటు చేయకుంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని విద్యార్థులు హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సంఘం కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ రాజధాని రాయలసీమ హక్కు అనే విషయాన్ని మన పాలకులు మరచిపోతున్నారన్నారు. సీమలో రాజధాని ఏర్పాటు కోసం కృషి చేయని రాజకీయ నాయకులను తరిమికొట్టాలన్నారు.

చదవండి :  సిద్దేశ్వరం అలుగుపై రంగంలోకి దిగిన నిఘావర్గాలు

సీమ వాసులైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డిలు కోస్తాంధ్ర వారితో కుమ్మకై సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రజలు, విద్యార్థులు మేల్కొని రాజధానిని సీమలో ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చెందిన కోస్తాంధ్రలో రాజధాని ఏర్పాటు చేస్తే వెనుకబడిన రాయలసీమ మరింత వెనుకుబాటుతనానికి గురవుతుందని అన్నారు.

అనంతరం కలెక్టరుకు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ విద్యార్థులు దస్తగిరి, నాగార్జున్, విజయకుమార్, శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.

చదవండి :  ఎత్తులపై గళమెత్తు - సొదుం శ్రీకాంత్

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: