కథకుల సందడితో పులకరించిన నందలూరు !

నందలూరు : ‘సాహిత్యం ద్వారానే సామాజిక స్పృహ పెరుగుతుంది. సమాజం మంచి మార్గంలో నడవడానికి కథ మార్గదర్శనం చేస్తోంది. కథకు మరణం లేదు’ అంటూ తెలుగు కథకు ఉన్న ప్రాధాన్యాన్ని పలువురు సాహితీ ప్రముఖులు వివరించారు. నందలూరులో ఆదివారం గొబ్బిళ్ల శంకరయ్య మెమోరియల్ స్కూల్ ఆవరణంలో కళింగాంధ్ర ప్రాంతానికి చెందిన కథకులు అట్టాడ అప్పల్నాయుడుకు కేతు కథా పురస్కారం, ఏఎన్ జగన్నాథశర్మకు కథాకోకిల పురస్కారం, ఏవీ రెడ్డి శాస్త్రికి కథా విమర్శ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా

రచయితల నేపథ్యాలను, వారి పుస్తకాలను కథకులు కేఎస్ రమణ, వి. ప్రతిమ, గుడిపాటి పరిచయం చేశారు. ఈ సదస్సులో కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ తన పేరిట ప్రతి యేటా నందలూరు కథానిలయం పురస్కారం అందచేయడం అభినందనీయమన్నారు. రచయితలంతా కలుసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు.
రచయితల నేపథ్యాలను, వారి పుస్తకాలను కథకులు కేఎస్ రమణ, వి. ప్రతిమ, గుడిపాటి పరిచయం చేశారు.  కథకులంతా ఇలా ఒకచోట కలవడంతో కథల పండుగలా ఉందన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ కథా సాహిత్యం ద్వారా సామాజికసేవ చేయవచ్చునన్నారు. వచ్చే ఏడాది కడపలో కథకుల సమ్మేళనం నిర్వహించే అవకాశం తనకు కల్పించాలని ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ కథకులను కోరారు. కుళ్లు, కుతంత్రాల రాజకీయాల్లో కన్నా సాహిత్యలోకంలో ఎంతో సంతృప్తి ఉందన్నారు. అనంతరం ఖదీర్‌బాబు పునర్లిఖించిన 100 కథల సంకలనం పరిచయ కార్యక్రమం జరిగింది. నందలూరు కథానిలయం అధ్యక్షుడు అబ్బిగారి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో, సీనియర్ న్యాయవాది గజ్జల రాంప్రసాద్ అధ్యక్షతన సాహితీ పురస్కారాల ప్రదానాలు, కథల పుస్తకాల ఆవిష్కరణలు జరిగాయి.  ఈ కార్యక్రమాల్లో సాహితీ నేత్రం సంపాదకులు శశిశ్రీ, అభ్యుదయరచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, మధురాంతకం రాజారాం సాహితీ సంస్థ అధ్యక్షులు మధురాంతకం నరేంద్ర, ” కడప డాట్ ఇన్ ఫొ ” వెబ్ సైట్ సంపాదకులు, కథారచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, చిత్తూరు జిల్లా అరసం అధ్యక్షుడు కోట పురుషోత్తం, వీణాఅజయ్, మల్లెమాల వేణుగోపాలరెడ్డి, కథా సాహితీ సంపాదకులు వాసిరెడ్డి నవీన్, సాకం నాగరాజు, రచయితలు వీ.చంద్రశేఖరరావు, ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు, స.వెం. రమేష్, సీఎస్ రాంబాబు, నూకా రాంప్రసాద్‌రెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్‌రెడ్డి, సుంకోజి దేవేంద్రాచారి, జి. వెంకటకృష్ణ, పుష్పాంజలి, దాదాహయూత్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, గంటేడ గౌరునాయుడు, మల్లిపురం జగదీష్, తానా ప్రతినిధి వేమనసతీష్, అల్లం అశోక్‌కుమార్, పిడికిటి నాగేశ్వరరావు, బీజెవైఎం రాష్ట్ర కార్యదర్శి రమేష్‌నాయుడు, బాషాఖాన్, జీఎస్‌ఎం విద్యాసంస్థల అధినేత గొబ్బిళ్ల సుబ్బరామయ్య, సుజాత, వివిధ ప్రాంతాలకు చెందిన రచయితలు పాల్గొన్నారు.
చదవండి :  నందలూరు సౌమ్యనాథ ఆలయం

ఇదీ చదవండి!

కడప జిల్లా కథాసాహిత్యం

కూలిన బురుజు (కథ) – కేతు విశ్వనాధరెడ్డి

కూలిన బురుజు ఊరు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: