అనుకున్నదే అయ్యింది!

కడప విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడింది. వాస్తవంగా అయితే సోమవారం విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ముందుగా భావించారు. తరువాత ప్రభుత్వ పెద్దల బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి.  ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్లు మీడియా హోరేత్తించింది. ముందుగా ఊహించినట్లుగానే విమానాశ్రయం ప్రారంభం మళ్ళా వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేది గురువారం తెలిసే అవకాశం ఉంది. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా అధికారులు కాని వివరణ ఇవ్వలేదు.

చదవండి :  బ్యాంకుల ఫోన్ నంబర్లు - కడప నగరం

 విమానాశ్రయంలో సాంకేతికమైన పనులను, నిర్మాణాలను నిర్దిష్టంగా నిపుణులు, ఎయిర్ఇండియా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు సిగ్నల్ లైట్లను పరిశీలించి వెళ్లారు. ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేసి చాలా రోజులు అయినప్పటికీ విమానాశ్రయం త్వరలో ప్రారంభించడంతో వాటిని పరిశీలించి వెళ్లినట్లు సమాచారం.

కడప విమానాశ్రయం మొత్తానికి ఎప్పుడు ప్రారంభిస్తారో … ఏమో?

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: