తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగర్జన సభ కోసం 7న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలు జిల్లా నాయకత్వానికి అధిష్ఠానం సమాచారం అందించింది. గతంలో మార్చి 27న నిర్వహించాలని ముందుగా భావించినా వాయిదా వేశారు.
చంద్రబాబునాయుడు ప్రజాగర్జనను కడపలో ఏ మైదానంలో నిర్వహించాలి అనే అంశాన్ని జిల్లా కేంద్రంలోని నేతలు పరిశీలిస్తున్నారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా చంద్రబాబు పర్యటనపై జిల్లా నేతలతో మాట్లాడినట్లు సమాచారం.
ప్రజాగర్జనకు భారీగా జనసమీకరణ చేసేందుకు దేశం నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి స్థానిక, ముసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత గర్జన చేయడం వెనుక చంద్రబాబు, తెదేపా నేతలు వ్యూహమేమిటో!