కడపలో నందమూరి కల్యాణ్‌రామ్
హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ రోజు (సోమవారం) కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఈ దర్గాను దర్శించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, కుదరడంలేదని, ఇప్పుడు స్వామి అనుగ్రహం కలగడంతో దర్శించుకున్నానని కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు.
తాను నటించి, నిర్మించిన చిత్రం ‘ఓం’ ఈనెల 19న విడుదల కానుందని ఆయన తెలిపారు.