కడప జిల్లాలో భారీగా తహశీల్దార్ల బదిలీ

కడప  : జిల్లాలో పనిచేస్తున్న 25 మంది తహశీల్దార్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసులును ప్రొద్దుటూరు తహశీల్దార్‌గా నియమించారు. కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్ కె వెంకటరెడ్డిని మైదుకూరు తహశీల్దారుగా నియమిం చారు. రాజంపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ గా పనిచేస్తున్న పి. భవానీని సంబేపల్లె తహశీల్దారుగా, .జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాల యంలో పనిచేస్తున్న ఎ. శ్రీనివాసులును కడప తహశీల్దారుగా, రాజంపేట ఆర్డీఓ కార్యాల యంలో పనిచేస్తున్న బి.వెంకటలక్ష్మిని రాజుపాళెం తహశీల్దారుగా నియమించారు. అలాగే అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఎం. దేవు లానాయక్‌ను బ్రహ్మంగారిమఠం తహశీల్దారు గా, గతంలో కలెక్టరేట్ సి సెక్షన్ సూపరిం టెండెంట్ పనిచేస్తూ సెలవులో వెళ్లి తిరిగి వచ్చిన వి. సుబ్బరాయుడును బద్వేలు తహశీ ల్దారుగా నియమించారు. ఎఫ్ సెక్షన్ సూపరిం టెండెంట్‌గా పనిచేస్తూ సెలవులో వెళ్లి తిరిగి వచ్చిన జి. భాస్కర్‌రెడ్డిని సీకే దిన్నెకు బదిలీ చేశారు. లక్కిరెడ్డిపల్లె తహశీల్దార్ మహ్మద్ గౌస్‌ను చక్రాయపేట మండలానికి బదిలీ చేశారు.

చదవండి :  పంటల సాగు వివరాలు - కడప జిల్లా

ఒంటిమిట్ట తహశీల్దారుగా పనిచేస్తున్న బి శాంతమ్మను చెన్నూరు తహశీల్దారుగా నియమించారు. కోడూరులో పనిచేస్తున్న జెడ్. కిరణ్‌జ్ఞానమూర్తిని దువ్వూరుకు బదిలీ చేశారు. వీరబల్లి తహశీల్దారుగా ఉన్న కేవీ శివరామయ్యను జమ్మలమడుగు తహశీ ల్దారుగా నియమించారు. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఎల్‌వీ ప్రసాద్‌ను కమలాపురం తహశీల్దారుగా నియమించారు. అలాగే అనంతపురం నుంచి వచ్చిన పి రామచంద్రయ్యను కోడూరు తహశీల్దారుగా నియమించారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చిన సి. సుధాకర్‌రెడ్డిని ముద్దనూరు తహశీల్దారుగా, ఎన్. చౌడప్పను పోరుమామిళ్ల తహశీల్దారుగా నియమించారు.

కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం శ్రీనివాసులును పుల్లంపేట తహశీల్దారుగా నియమించారు. పుల్లంపేటలో పనిచేస్తున్న కె.వినాయకంను రాజంపేట తహశీల్దారుగా నియమించారు. రాజంపేటలో పనిచేస్తున్న సి. గుణభూషణ్‌రెడ్డిని కలెక్టరేట్ ిసీ సెక్షన్ సూపరింటెండెంట్‌గా నియమించారు. రామాపురం తహశీల్దార్‌గా పనిచేస్తున్న జి. చిన్నయ్యను రాయచోటికి బదిలీ చేశారు. రాయచోటి తహశీల్దార్ ఎం. నాగరాజును ఒంటిమిట్టకు బదిలీ చేశారు. కర్నూలుజిల్లా నుంచి వచ్చిన బి కృష్ణానాయక్‌ను సుండుపల్లె తహశీల్దార్‌గా నియమించారు. కడప ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న వి. ప్రభాకర్‌రెడ్డిని వల్లూరు తహశీల్దారుగా నియమించారు. సంబేపల్లె తహశీల్దార్ ఎం ప్రభాకర్‌రెడ్డిని ఎర్రగుంట్లకు బదిలీ చేశారు. బి.కోడూరు తహశీల్దార్ పీవీ కృష్ణుడు ను చిట్వేలికి బదిలీ చేశారు.

చదవండి :  మంత్రి డిఎల్‌.రవీంద్రారెడ్డిపై వేటు

ఎఫ్‌ఏసీల నియమాకం

కలెక్టరేట్ సీ సెక్షన్ సూపరింటెండెంట్‌గా బదిలీపై వచ్చిన సి గుణభూషణ్‌రెడ్డికి ఎఫ్ సెక్షన్ పూర్తి అదనపు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. అలాగే జి సెక్షన్ సూపరింటెండెంట్ జి చెండ్రాయుడుకు హెచ్ సెక్షన్ ఎఫ్‌ఏసీగా నియమించారు. రాజంపేట ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్‌ఎండీ జిన్నా ను అదే కార్యాలయం ఏఓగా ఎఫ్‌ఏసీ బాధ్యతలు ఇచ్చారు. కలసపాడు డిప్యూటీ తహశీల్దార్ ఎస్ రామచంద్రప్రభుకు అదే మండల తహశీల్దారుగా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగిం చారు. చక్రాయపేట తహశీల్దార్ గౌస్‌ను లక్కిరెడ్డిపల్లె తహశీల్దార్ ఎఫ్‌ఏసీగా నియమిం చారు. లింగాల డిప్యూటీ తహశీల్దారుగా ఉన్న కె కుళ్లాయప్పను అదే మండలానికి తహశీల్దార్ ఎఫ్‌ఏసీగా బాధ్యతలు ఇచ్చారు.

చదవండి :  యోగి వేమన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12-బీ గుర్తింపు

జమ్మలమడుగు తహశీల్దార్ కేవీ శివరామయ్యకు పెద్దముడియం తహశీల్దారుగా, రామాపురం డిప్యూటీ తహశీల్దార్ ఓ రామభూపాల్‌రెడ్డి అదే మండలానికి తహశీల్దారుగా ఎఫ్‌ఏసీ ఇచ్చారు. కాశినాయన డిప్యూటీ తహశీల్దారుగా ఉన్న పీవీ రమణకు అదే మండల తహశీల్దారుగా ఎఫ్‌ఏసీ ఇచ్చారు. కొండాపురం తహశీల్దార్ ఎం మోహన్‌దాస్‌కు సింహాద్రిపురం మండల అదనపు బాధ్యతలు అప్పగించారు. ముద్దనూరు తహశీల్దార్ సి. సుధాకర్‌రెడ్డికి తొండూ రు తహశీల్దారుగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

వీఎన్ పల్లె డిప్యూటీ తహశీల్దార్ బి. రామ్మోహన్‌కు అదే మండల తహశీల్దారుగా ఎఫ్‌ఏసీ బాధ్యతలు ఇచ్చారు. రాయచోటి తహశీల్దార్ జి చిన్నయ్యకు వీరబల్లి, వేముల తహశీల్దార్ ఎస్ రియాజుద్దీన్‌కు వేంపల్లె, బద్వేలు తహశీల్దార్ వి సుబ్బరాయడుకు బి కోడూరు తహశీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ ఆదేశాలు ఇచ్చారు.

ఇదీ చదవండి!

సొంత జిల్లాకు తరలించుకుపోతున్నా….

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలోని అభివృద్ధి పథకాలను సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ విషయమై కడప జిల్లా కాంగ్రెస్ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: