‘కడప అంటే చేయంపో’ అన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి: డాక్టర్‌ గేయానంద్‌

    ‘కడప అంటే చేయంపో’ అన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి: డాక్టర్‌ గేయానంద్‌

    కడప: కడప జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో వివక్షత చూపుతోందని, ఇది మంచి పరిణామం కాదని శాసనమండలి సభ్యుడు డాక్టర్‌ గేయానంద్‌ విమర్శించారు. ‘కడప అంటే చేయంపో’ అన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

    శుక్రవారం సమగ్రాభివృద్ధి-సామాజిక న్యాయం అనే అంశంపై కలెక్టరేట్‌ ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కడప జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రితో, అధికారులతో ఎవరు మాట్లాడినా స్పందించకపోవడం సమంజసం కాదని చెప్పారు. జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.

    చదవండి :  కడప జిల్లాపై బాబు వివక్ష: రామచంద్రయ్య

    ఓట్లు, సీట్లు ఎన్నికల సమయంలో మాత్రమే చూడాలని అధికారంలో వచ్చిన తరు వాత ప్రభుత్వం ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమపథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఉర్దూ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత చదువు చది వేందుకు జిల్లాలో ఉర్దూ జూనియన్‌ కాలేజి, యూనివర్శిటీ అందు బాటులో లేకపోవడం విచారకరమన్నారు. దీనివల్ల మైనార్టీ విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. మైనార్టీలు నివసిస్తున్న ప్రాంతాలలో వారానికి ఒక్కరోజు కూడా నీరు వందలకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

    చదవండి :  ఎంపీల రాజీనామాల తిరస్కరణ

    దారుణ పరి స్థితుల నుంచి ప్రజలను కాపాడాల్సిన కలెక్టర్‌, అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రిమ్స్‌లో డాక్టర్ల కొరత ఉందన్నారు. మౌళిక సదు పాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

    ‘కడప అంటే చేయంపో’ అనే ఒక భయానక పరిస్థితి నెలకొని ఉందన్నారు. ప్రభుత్వం ఇటువంటి వాతావరణాన్ని సృష్టించడం సరైనది కాదన్నారు.

    కడప నగరంలో నీటి సమస్య శాశ్విత పరిష్కారానికి సోమశిల బ్యాక్‌వాటర్‌ తీసుకురావాలని సిపిఎం ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నా అధికారు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. మనిషి చనిపోతే పూడ్చేందుకు కనీసం శ్మశానవాటిక కూడా లేకపోవడం దారుణమైన విషయమని తెలి పారు.

    చదవండి :  రుణమాఫీ అమలు కోసం జిల్లావ్యాప్తంగా ధర్నాలు

    కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గసభ్యులు పాల్గొన్నారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *