ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తా!

    ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తా!

    ఇటీవలే కాంగ్రెస్ నుండి తరిగి తెలుగుదేశంలో చేరిన కందుల రాజమోహన్‌రెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబును కలిసి ఈ విషయమై విన్నవించినట్లు ఆయన తెలిపారు.

    కడపలోని తన ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మంచి నాయకుడు అవసరమన్నారు. బాబు సిఎం అయితే రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

    చదవండి :  పోరాటం చేయకపోతే ఉక్కు పరిశ్రమ దక్కదు : అఖిలపక్షం

    కడప లోక్‌సభ ఎన్నికల్లో గతంలో పలు అవకాశాలు తృటిలో జారిపోయాయని – తనకు ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తానని చెప్పారు. పులివెందుల బరిలో సతీష్‌రెడ్డి సతీమణి ఉన్నందున అక్కడ పోటీ చేయనన్నారు.

    మొత్తానికి లోక్ సభ అభ్యర్తిత్వం ఖరారైతే ఎన్నికలలో మరోమారు నిధుల వరద పారించేందుకు  కందుల సోదరులు సిద్ధమయ్యారన్నమాట! ఇప్పటికే డిఎల్ కడప తెదేపా లోక్ సభ అభ్యర్తిత్వం ఆశిస్తుండగా ఆశావాహుల జాబితాలో కందుల బ్రదర్స్ చేరారు. మరి బాబు ఈ అంశాన్ని ఎలా కొలిక్కి తెస్తారో!!

    చదవండి :  సిటీబస్సుల కోసం కడపలో మరో వాహనశాల

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *