
ఓట్ల బడికి రెండు రోజుల సెలవులు
పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న బడులకు ఎన్నికల రోజు, ముందు రోజు సెలవుగా ప్రకటించి, బడిని ఎన్నికల సిబ్బందికి అప్పగించాలని జిల్లా విద్యాధికారి అంజయ్య ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు.
ఇద్దరు ఉపాధ్యాయులకు ఓట్లకు సంబందించిన విధులుంటే ఆ బడులకు కూడా రెండు రోజులు సెలవులు ఉంటాయన్నారు. ఎన్నికలు లేని ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విధులు లేకుంటే పాఠశాలలు యధాతథంగా నిర్వహించాలన్నారు.
ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి పాఠశాలలు మామూలుగా కొనసాగించాలన్నారు.
ఈ నిబంధనలు 23, 27, 31 తేదీలకు వర్తిస్తాయన్నారు.