ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన  శాసనం !

ఒంటిమిట్ట కోదండ రామాలయం

ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన శాసనం !

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం రధోత్సవం జరుగుతుంది. కోదండరాముని కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు ఈ రధోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది.మట్లి రాజుల కాలంలో కూడా ఈ ఆనవాయితీ ఉండేది.

అప్పట్లో ఒంటిమిట్ట సిద్ధవటం తాలూకాలోనే పెద్దదైన గ్రామం (ఆధారం: కడప జిల్లా గెజిట్: 1914, 1875) , ఈ గ్రామంలో వివిధ కులాలకు చెందిన ప్రజలు నివశిస్తుండేవారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలు అవీ గ్రామస్తుల ఆధ్వర్యంలోనే జరిగేవి.

ఒకసారి రధోత్సవం విషయంలో ఒంటిమిట్ట కంసాలీలకు (వడ్ల కమ్మర్లు), బలిజలకు మధ్య గొడవ జరిగింది. బలిజలు, కంసాలీలను రధోత్సవం జరిగేటప్పుడు రధం మీద కూర్చోడానికి అనుమతించలేదు. ఈ ఘటన ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసింది. అప్పట్లో గ్రామంలో సంఖ్యాపరంగా ఆధిపత్యం బలిజలది అయి ఉండవచ్చు

చదవండి :  ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి

చివరకు ఈ విషయం సిద్ధవటాన్ని పరిపాలిస్తుండిన మట్లి అనంతరాజు వద్దకు చేరింది. ఈ విషయంలో విచారణ చేయించిన రాజు గారు కంసాలీలను రథం మీద కూర్చోనివ్వాలని ఆదేశించినారు. తిరుమలలో కూడా కంసాలీలను రథం మీద కూర్చోనిచ్చే సంప్రదాయం ఉందని అదే సంప్రదాయాన్ని కోదండరాముని రథోత్సవంలోనూ పాటించాలని రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. ఇదే విషయాన్ని అనంతరాజు కోదండ రామాలయం ప్రాకారం మీద శాసనంగా వేయించినాడు.  అది ఇప్పటికీ ఉందిట.

ఈ శాసనం AD 1589 కాలానికి చెందినది కావచ్చు. (ఆధారం: మెకంజీ కైఫీయత్ Mss. No. 15-4-33 (కొత్తూరు కైఫీయత్)  ,  Temples of Cuddapah District)

చదవండి :  ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది?

మరియు -మెకంజీ కైఫీయత్తులు ,కడప జిల్లా ,ఆరో భాగం ,పుటలు 438, 43 ( ప్రచురణ : సి.పి.బ్రౌన్ పరిశోధనా కేంద్రం , కడప )

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *