
ఒంటిమిట్ట కోదండ రామాలయం
ఏప్రిల్ 14 నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 12వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 15న సాయంత్రం 4.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్ :
14-04-16(గురువారం) మూలవర్ల అభిషేకం (ఉదయం), అంకురార్పణం (సాయంత్రం)
15-04-16(శుక్రవారం) ధ్వజారోహణం, శ్రీరామజయంతి (ఉదయం), పోతన జయంతి, శేషవాహనం (సాయంత్రం)
16-04-16(శనివారం) వేణుగాన అలంకారం(ఉదయం), హంస వాహనం(సాయంత్రం)
17-04-16(ఆదివారం) వటపత్రసాయి అలంకారం (ఉదయం), సింహ వాహనం (సాయంత్రం)
18-04-16(సోమవారం) నవనీతకృష్ణ అలంకారం (ఉదయం), హనుమంత సేవ (సాయంత్రం)
19-04-16(మంగళవారం) మోహినీ అలంకారం (ఉదయం), గరుడసేవ (సాయంత్రం)
20-04-16(బుధవారం) శివధనుర్భ అలంకారం(ఉదయం), శ్రీసీతారాముల కల్యాణం(రా|| 8 గం||), గజవాహనం(రాత్రి 10 గం||)
21-04-16(గురువారం) రథోత్సవం ———–
22-04-16(శుక్రవారం) కాళీయమర్ధన అలంకారం(ఉదయం), అశ్వవాహనం (సాయంత్రం)
23-04-16(శనివారం) ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు
24-04-16(ఆదివారం) చక్రస్నానం(ఉదయం), ధ్వజావరోహణం(సా|| 5 గం||), పుష్పయాగం(రాత్రి 8 గం||).