ఏ విచారణ వేసుకుంటావో వేసుకో?

మాజీ  మంత్రి డి.ఎల్ బుధవారం దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేటలలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ తనకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ శాసనసభ్యులపైన విరిచుకు పడ్డారు. మట్కా నిర్వాహకుడైన వీరశివారెడ్డి సీఎం చెంచాగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

మట్కాబీటర్‌కు ఎలా టికెట్ ఇస్తారని వైఎస్‌ను ఓ యువ డీఎస్పీ అడిగారన్నారు. దీనిపై వీరశివాను వైఎస్ ప్రశ్నించగా తాను కాకుండా కుటుంబసభ్యులతో మట్కా ఆడిస్తున్నాన్న నీచసంస్కృతి వీరశివారెడ్డిదన్నారు. డబ్బు సంపాదించేందుకు ఏ అవతారమెత్తాలో అన్ని అవతారాలు వీరశివా ఎత్తాడని, పార్టీలు మార్చాడని విమర్శించారు. అలాంటి వ్యక్తి త నపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. దొంగకార్ల కేసులో ఇరుక్కుని వైఎస్ కాళ్లు పట్టుకుని ఆకేసు నుంచి విముక్తి పొందిన వీరశివా తన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నాన్న మట్కా ఆడితే.. ఆయన కొడుకు మద్యం వ్యాపారి అన్నారు. వీరశివా కుమారుడు డీసీసీబీ చైర్మన్ అయి ఉంటే బ్యాంకును తాకట్టు పెట్టేవారన్నారు. డీసీసీబీ పదవి రాలేదనే అక్కసుతోనే తనపై విమర్శలు చేస్తున్నాడన్నారు. కళంకితుడైన వీరశివారెడ్డి పార్టీ టిక్కెట్లు ఇచ్చేస్థాయికి ఎదిగితే, మలిన పడిన వారి చేతులతో ఇచ్చే అసెంబ్లీ టిక్కెట్టు తనకు అవసరం లేదని, కాంగ్రెస్‌పార్టీలో పనిచేయాల్సిన అవసరం ఉండదని, స్వతంత్రుడిగా పోటీ చేస్తానన్నారు.

చదవండి :  'పులివెందులకు తాగునీటి ఇక్కట్లు తప్పవు'

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎమ్మెల్సీ చెంగలరాయుడులపై కూడా డీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ముఖ్యమంత్రి చెంచాగా ఉన్నావు.. నేను వేల కోట్లు సంపాదించానని అంటున్నావు.. ఏ విచారణ వేసుకుంటావో వేసుకో? నా అవినీతిని నిరూపించు… నేను దేనికైనా సిద్ధమేనని’ వరదకు డీఎల్ సవాల్ విసిరారు.

బత్యాలకు ఎమ్మెల్సీ పదవి తాను పెట్టిన భిక్ష అన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అధిష్టానం వద్దకు తీసుకెళ్లి ఎమ్మెల్సీ పదవి ఇప్పించిన కృతజ్ఞతను మరిచి బర్తరఫ్ చేసినందుకు డబుల్ థ్యాంక్స్ చెప్పిన నీచ సంస్కతి చెంగల్‌రాయుడిదన్నారు.

చదవండి :  తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

గతంలో జిల్లాలో పార్లమెంటు ఉప ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరూ పోటీ చేయకుంటే పార్టీ కోసం ప్రాణస్నేహితుని కుమారుడిపైన పోటీకి దిగానని డీఎల్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఖాజీపేటలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: