ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ- – అన్నమయ్య సంకీర్తన

ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-
వాని నన్నొకయింత వదలక నను నేలవలదా
॥చ1॥
అపరాధిఁగనక నన్నరసి కావుమని
అపరిమితపుభయ మంది నీకు శరణంటిఁగాక
నెపములేక నన్ను నీకుఁ గావఁగ నేల
అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా
॥చ2॥
ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-
వనవరతము నాయాతుమ విహరించుమంటిఁ గాక
యెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-
ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప
రాగము: సామంతం
రేకు: 0005-06
సంపుటము: 1-35

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  పట్టినచోనే వెదకి భావించవలెఁగాని - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: