ఏమిసేతు దేవదేవ – అన్నమయ్య సంకీర్తన

ఏమిసేతు దేవదేవ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏమిసేతు దేవదేవ యింతయును నీమాయ
కామినులఁ జూచిచూచి కామించె భవము
॥చ1॥
చంచలపుఁగనుదోయి సతులబారికిఁ జిక్కి
చంచల మందెను నాదిచ్చరి మనసు
కంచుఁ గుత్తికలవారి గానములఁ జొక్కి చొక్కి
కంచుఁబెంచు నాయఁబో నాకడలేని గుణము
॥చ2॥
తీపులమాటల మించి తెఱవలభ్రమఁ దరి
తీపుల పాలాయఁబో నాతెలివెల్లాను
పూఁపల నవ్వుల తోడి పొలఁతులఁ జూచిచూచి
పూఁపలుఁ బిందెలునై పొల్లువోయఁ దపము
॥చ3॥
కూటమి సతులపొందు కోరి కోరి కూడికూడి
కూటువ నావిర తెందో కొల్లఁబోయను
నీటున శ్రీవేంకటేశ నినుఁగని యింతలోనె
జూటరినై యింతలోనె సుజ్ఞానినైతి
రాగము: కాంబోది
రేకు: 0083-03
సంపుటము: 1-401

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కాంబోది

చదవండి :  అన్ని చోట్లఁ పరమాత్మ నీవు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: