ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-

॥పల్లవి॥
ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-
నెవ్వరికి నేమౌనో యీ జీవుఁడు
॥చ1॥
ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనక
కెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడు
యెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-
మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు
॥చ2॥
యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-
కెక్కడో తనజన్మ మీ జీవుఁడు
యెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యొప్పు-
డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు
॥చ3॥
ఎన్నఁడును జేటులేనీ జీవుఁడు వెనక-
కెన్నిదనువులు మోవఁడీ జీవుఁడు
యెన్నఁగల తిరువేంకటేశుమాయలఁ దగిలి
యెన్నిపదవులఁబొందఁ డీజీవుడు
రాగము: నాట
రేకు: 0016-03
సంపుటము: 1-97

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాట

చదవండి :  చెల్లునా నీ కీపనులు చెన్నకేశా - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *