ఆదివారం , 1 సెప్టెంబర్ 2024
ఎర్రచందనం

మన ఎర్రచం’ధనం’తో ప్రభుత్వానికి 300+ కోట్లు

కడప జిల్లాలో నిల్వ ఉన్న 1166 టన్నుల ఎర్రచందనం మొదటి విడత టెండర్లలో సుమారు రూ.315కోట్లు ధర పలికింది. ఎర్రచందనానికి నిర్వహించిన ఈ టెండర్లలో వ్యాపారులు కడప జిల్లాలో నిల్వ ఉన్న ఎర్రచందనానికి టెండర్లు పాడారు. వీటిలో బీ, సీ గ్రేడులు మాత్రమే ఉన్నాయి. వీటిలో బీ గ్రేడు ఎర్రచందనం కేవలం సుమారు రెండు టన్నులు మాత్రమే ఉండగా మిగిలిన 1164 టన్నులు సీ గ్రేడ్‌ ఎర్రచందనం. ఈ మొత్తానికి మొదటి విడతలో ఈ టెండర్లు పిలిచారు.

బీ గ్రేడు చందనం టన్ను 54 లక్షల రూపాయలు పలుకగగా, సీ గ్రేడ్‌ చందనం 30 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలుగా వేర్వేరు రేట్లు పలికినట్లు  సమాచారం. సగటున సీ గ్రేడ్‌ చందనం 27లక్షలు పలికింది అనుకున్నా 1164 టన్నుల సీ గ్రేడు చందనానికి రూ. 314కోట్లు, రెండు టన్నుల బీ గ్రేడు చందనానికి మరో కోటి రూపాయలు కలిసి 315 కోట్ల రూపాయల మేరకు ధర పలికిందని అంచనాకు రావచ్చు.

చదవండి :  మన పోలీసుకుక్కలకు బంగారు, రజత పతకాలు

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ చీఫ్‌ కన్జర్‌వేటర్లు బుధవారం కడపలోని మొదటివిడత టెండర్లు పిలిచిన లాట్లను పరిశీలించి వెళ్లారు. కడప, భాకరాపేటలో నిల్వ ఉన్న చందనాన్ని పరిశీలించిన అనంతరం వారు నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. ఎర్రచందనం టెండర్లకు అంతర్జాతీయస్థాయిలో మంచి స్పందన కనిపించడంతో పాటు భారీ రేటు పలికింది. కడప జిల్లాలోని సీ గ్రేడు టెండర్లకు తక్కువ ధర పలకడంతో వీటిలో కొంతభాగానికి మరోసారి టెండర్లు పిలిచే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నట్లు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

చదవండి :  కడపజిల్లాపై ఉర్దూ ప్రభావం

కడప జిల్లాలోని ఎర్రచందనం అమ్మగా వచ్చిన సొమ్మును ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ది కోసం ఖర్చు చేయాలి. అలాగే ఇక్కడి అడవులను పరిరక్షించేందుకు కూడా సదరు సొమ్మును ఖర్చు పెడితే బాగుంటుంది. లేని పక్షంలో ప్రాంతీయ అసమానతల నేపధ్యంలో భవిష్యత్తులో ఇదో పెద్దవివాదంగా మారే అవకాశం ఉంది. ఇంతకీ ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారిస్తుందా?

ఎర్ర చందనం (Red sanders) చెట్టు శాస్త్రీయ నామం Pterocarpus santalinus. అరుదైన ఈ వృక్షసంపద రాయలసీమ జిల్లాలలోని అడవులలో విస్తారంగా పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు బాగా పెరుగుతాయి.

చదవండి :  'కాబోయే కలెక్టర్ అమ్మానాన్నలు'

ఇదీ చదవండి!

dengue death

జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి?

పల్లెలను వదలని పాడు జరాలు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: