ప్రొద్దుటూరు

ఎర్రగుంట్ల-నొస్సంల మధ్య ట్రయల్ రన్ విజయవంతం

త్వరలో అందుబాటులోకి 47కి.మీ రైలు మార్గం

ప్రొద్దుటూరు: ఎర్రగుంట్ల-నొస్సం మార్గంలో సోమవారం రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపించి తనిఖీ చేశారు. పూర్తయిన రైల్వేపనులను దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమీషనరు(సిఆర్ఎస్) డి.కె.సింగ్ పరిశీలించారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో ఆయన ఎర్రగుంట్లకు చేరుకున్న ఆయన ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. అనంతరం  స్టేషన్‌లోని బ్యాటరీ, ఐపీఎస్, ఈఎల్‌సీ, ఓఎఫ్‌సీ గదులను పరిశీలించారు.

ఎర్రగుంట్ల నుంచి రైల్వేసిబ్బందితో కలిసి ట్రాలీలో తనిఖీకి వెళ్లారు. ఎర్రగుంట్ల-నొస్సం మధ్యలోని 47 కి.మీ ట్రాక్‌లోని పట్టాలను, సిగ్నల్స్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రాక్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎస్.ఉప్పలపాడు, కర్నూలు జిల్లాలోని నొస్సం వరకు ఆయన తనిఖీ చేశారు. ఈ మార్గంలోని రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫాంలు, సిగ్నల్స్, క్రాసింగ్‌గేట్లు ఆయన పరిశీలించారు.

చదవండి :  కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం

ప్రత్యేక రైలు ఎర్రగుంట్ల నుంచి నొస్సం వరకు వెళ్లింది. ట్రాక్‌ను పరిశీలించిన తరువాత నొస్సం నుండి ప్రత్యేక రైల్లో ఎర్రగుంట్లకు చేరుకున్నారు. కార్యక్రమంలోపలువురు రైల్వే సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

మొత్తానికి ప్రతిపాదిత ఎర్రగుంట్ల – నంద్యాల రైలు మార్గంలో కొంత భాగం దశాబ్దాల తరువాత పూర్తి కావటం విచారించదగ్గ విషయమే అయినప్పటికీ కనీసం అది అందుబాటులోకి రాబోతుండడం సంతోషించాల్సిన విషయమే!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: