
ఎన్ని లేవు నా కిటువంటివి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎన్ని లేవు నా కిటువంటివి కన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతి ॥చ1॥ అరయ నేఁజేసిన యపరాధములు చూచి కరుణించి వొకడైనాఁ గాచునా కరచరణాదులు కలిగించిననిన్నుఁ బరికించి నీసేవాపరుఁడ గాలేనైతి ॥చ2॥ యేతరినై నేనెఱిఁగి సేసినయట్టి- పాతక మొకఁడైనా బాపునా ఆతుమలోనుండి యలరి నీవొసఁగిన- చేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి ॥చ3॥ శ్రీవేంకటేశ నేఁ జేసిన యితరుల- సేవ కొకఁడు దయసేయునా నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ నీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి |
రాగము: గౌళ రేకు: 0005-03 సంపుటము: 1-31 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గౌళ