ముఖ్యమంత్రి కక్ష గట్టారు

ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కొనసాగుతున్న ఆందోళనలు

కడప : కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు దిష్టిబొమ్మతో ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసే హక్కు తమకు ఉందని, దీన్ని అడ్డుకోవడానికి మీరెవరంటూ సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవేవి పట్టని పోలీసులు దిష్టిబొమ్మను లాగేశారు. ఈ సందర్బంగా పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వావాదం, తొపులాట చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. సీపీఎం కార్యకర్తలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు నిర్వహించారు.

చదవండి :  ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదు? - బి.వి.రాఘవులు

ఈ దశలో ప్రక్కనే నిరాహార దీక్షా శిబిరంలో ఉన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్, కార్యకర్తలు, వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబు తదితరులు కూడా సీపీఎం కార్యకర్తలతో జత కలిశారు. ఈ సందర్బంగా సీపీఎం నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కడపలో ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు నేడు మాట మార్చారని విమర్శించారు. కడపజిల్లాలో తమ పార్టీకి సీట్లు రాలేదని సీఎం కక్షగట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 11 జాతీయ స్థాయి సంస్థలను మంజూరు చేయగా, అందులో ఒక్కటి కూడా కడపకు ఇవ్వకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదని, జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన డీఆర్‌డీఓ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఇతర జిల్లాలకు మళ్లించి అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్శిటీ విషయంలో కూడా ప్రభుత్వం ఇదే ధోరణి అవలంభిస్తోందని చెప్పారు.

చదవండి :  జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి?

విశ్వవిద్యాలయ సాధన కోసం గత 16 రోజులుగా యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. ఈ దశలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించినా పోలీసులతో అడ్డుకోవడం దారుణమని దుయ్యబట్టారు. అనంతరం నాయకులు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న దీక్షా శిబిరంలోకి వెళ్లారు.

వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబులు మాట్లాడుతూ జిల్లా వాసులు ఎవరూ అడగకపోయినప్పటికీ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానంటూ ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రకటించారని,  ఇప్పుడేమో మాటమార్చి కర్నూలు, గుంటూరు అంటూ రోజుకోమాట చెప్పడం దారుణమన్నారు.

చదవండి :  ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కినారు

రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు కేంద్ర స్థానంలో కడప ఉందని చెప్పారు. అలాగే ముస్లిం జనాభా కూడా కడపలోనే అధికంగా ఉందన్నారు. అన్ని అనుకూలతలు ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: