ఉక్కు పరిశ్రమ కోసం ‘అఖిల‌ప‌క్షం’ ఆందోళన

    విమానశ్రయానికి ప్రదర్శనగా వెళుతున్న అఖిలపక్షం నేతలు

    ఉక్కు పరిశ్రమ కోసం ‘అఖిల‌ప‌క్షం’ ఆందోళన

    కడప: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలోనే ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కడప విమానాశ్రయం వద్ద ఆందోళన చేపట్టారు. విమానాశ్రయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అడ్డుకునేందుకు యత్నించారు.

    అంతకు మునుపు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆపార్టీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కడప జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని తీర్మానం చేశారు.

    ఆందోళన కార్యక్రమానికి ముందుగా ఎయిర్‌పోర్టు వద్ద నాయకులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోనే ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓట్లు, సీట్లు రాలేదని జిల్లాపై వివక్షత చూపడం సిఎం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. మోడి, చంద్రబాబునాయుడు వారి ఆస్తులతో ఇక్కడ ఉక్కుఫ్యాక్టరీ పెట్టమని తాము అడగడంలేదని తెలిపారు. యేళ్ల తరబడి వివక్షతకు గురైన రాయలసీమ, అందులోనూ కడప జిల్లా కరువు, నిరుద్యోగం, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలతో అల్లాడిపోతోందని పేర్కొన్నారు. ఉక్కఫ్యాక్టరీ జిల్లాలో ఏర్పాటు చేయకపోతే ప్రజల జీవనమే కష్టతరమవుతుందని చెప్పారు. ఫ్యాక్టరీ విషయంపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

    చదవండి :  విజయమ్మకు 81వేల 373 ఓట్ల మెజార్టీ

    అఖిలపక్ష నాయకులు కడప ఎయిర్‌పోర్టు సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకుని అక్కడి నుండి ర్యాలీగా విమానాశ్రయ గేటువద్దకు చేరుకున్నారు. విమానాశ్రయం గేటుఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును కడప ఎంఎల్‌ఎ అంజద్‌బాష, మేయర్‌ సురేష్‌బాబు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణ, మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీ, కార్మిక, కర్షక నాయకుడు సి.హెచ్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఖండించారు.

    చదవండి :  ఈ రోజు కడపకు శివరామక్రిష్ణన్

    జిల్లా ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై సిఎంకు వివరించేందుకు వెళుతున్న నాయకులను అరెస్టు చేయడం దారుణ మన్నారు. సిఎం కలిసేందుకు అనుమతివ్వాలని పోలీస్‌ ఉన్నతాధికారులను డిమాండ్‌ చేశారు. దీంతో స్పందించిన అధికారులు పైన పేర్కొన్న నాయకులను సిఎంను కలిసేందుకు ఎయిర్‌పోర్టులోనికి అనుమతించారు.

    కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాపిరెడ్డి, సావంత్‌సుధాకర్‌, లక్ష్మిదేవి, మరియమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకటశివ, నాయకులు చంద్ర, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చల్లా రాజశేఖర్‌, షఫీ, కరీముల్లా, రామలక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు.

    చదవండి :  బాబు గారి స్వర్ణాంధ్ర ఇదే .... పాలగుమ్మి సాయినాద్

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *