ఈ రోజు నుంచి పంచాయతీ నామినేషన్ల స్వీకరణ

జిల్లా వ్యాప్తంగా 785 పంచాయతీలకు సంబంధించి ఏ పంచాయతీకి ఆ పంచాయతీ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అదేరోజు నుంచి 241 క్లస్టర్ల పరిధిలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

మూడు దశల్లో జరిగే ఎన్నికలకు ఈనెల 9వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 13న, నామినేషన్ల తిరస్కరణపై ఆర్డీఓలకు అప్పీళ్లు 15న, అప్పీళ్లకు ఆర్డీఓ పరిష్కారం 16న, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 17వ తేదీగా ఇంతకుమునుపే ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది.

చదవండి :  కిడ్నాపైన కాంట్రాక్టర్ విడుదల

పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను 17వ తేదీనే ప్రచురిస్తారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు సాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. సర్పంచ్ అభ్యర్థి ఓసీ అయితే రూ. 2000, ఎస్సీ, ఎసీ,్ట బీసీలైతే రూ. 1000 ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. వార్డులకు సంబంధించి ఓసీ అభ్యర్థి అయితే రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి :  కథకుల సందడితో పులకరించిన నందలూరు !

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: