ఎద్దుల ఈశ్వర్ రెడ్డి

ఈశ్వర్‌రెడ్డి సేవలు ఆదర్శనీయం

కడప: కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి సేవలు మరువలేనివని – ఆయన పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు, కర్షకులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశ లు పాటుపడ్డారని ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిబాషించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డి జయంతి సందర్భంగా నూతన ఆంధ్రప్రదేశ్‌ లో రాయలసీమ సమగ్రాభివృద్ధి అనే అంశం పై స్థానిక నూర్‌-ఏ-జహాన్‌ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన సదస్సుకు ఎన్‌ఆర్‌ ఆర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పూర్వ సంచాలకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి నాలుగు పర్యాయాలు పార్లమెంట్‌ సభ్యుడిగా సేవలు అందించడంతో పాటు అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టి నిస్వార్థంగా పనిచేసి అజాత శత్రువుగా పేరు గడించారన్నారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ఉద్యమించిన ప్రథముల్లో ఆయ న ఒకరన్నారు. ఎన్టీఆర్‌ ఈ ప్రాంతం వ్యక్తి కా కపోయినా గాలేరు-నగరి, సుజల-స్రవంతి, తెలుగుగంగ ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన పరిపాలన కాలంలో పరుగులు పెట్టించారన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ఉపయోగపడే లా ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రా వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

చదవండి :  డి.ఎల్ అలా చేస్తారా?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఓబులేసు మాట్లాడు తూ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి రైతాంగాభివృద్ధికి నీటి ప్రాజెక్టుల సాధనకు ఎంతగానో ఉద్యమించారన్నారు. ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన తరువాత మనస్థాపం చెందే పరిణామాలు జరుగుతున్నాయన్నారు. విభజన సందర్భంగా సమైక్య ముసుగులో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కించుకున్నారని ఇదేమీ తమకు అభ్యంతరం కాదని దుమ్ముగూడెం, నాగార్జునసాగర్‌ టెయిల్ పాండ్ కు ఎందుకు జాతీయ హో దా కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.

చదవండి :  జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ?

సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ మాట్లాడు తూ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేసి జిల్లా రైతాంగాన్ని అదుకోవాలన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి పట్ల వివక్ష చూపుతోందన్నారు. ప్రధానంగా కడప జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో ఐక్య ఉద్యమాలకు ఎద్దుల ఈశ్వ రరెడ్డి వర్ధంతి సభ వేదిక కావాలని ఆయన పిలుపునిచ్చారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: