ఈపొద్దు సందకాడ ప్రొద్దుటూరులో దివ్య సత్సంగ్‌

    ఈపొద్దు సందకాడ ప్రొద్దుటూరులో దివ్య సత్సంగ్‌

     ప్రొద్దుటూరులో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 మధ్య జరుగనున్న దివ్య సత్సంగ్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. ఇందుకోసం టీబీ రోడ్డులో ఉన్న అనిబిసెంట్ పురపాలిక మైదానం భారీ వేదికతో సిద్ధమైంది.

    శుక్రవారం సాయంత్రం గురూజీ శిష్యులు పర్యటన వివరాలను వెల్లడించారు.

    శనివారం ఉదయం 7 గంటలకు రవిశంకర్ గురూజీ ప్రత్యేక రైలులో హైదరాబాద్ కాచిగూడ నుంచి ప్రొద్దుటూరుకు బయల్దేరనున్నారు. 22 బోగీలున్న ఈ రైలులో వెయ్యిమంది శిష్యులు ఉంటారన్నారు. సాయంత్రం 4 గంటల సమయానికి రైలు ఎర్రగుంట్లకు చేరుకుంటుందని వెల్లడించారు.

    చదవండి :  ప్రొద్దుటూరు కోడెద్దులు రంకేసి బండ లాగితే...

    అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన ప్రొద్దుటూరుకు వస్తారన్నారు. అనిబిసెంట్ పురపాలిక మైదానంలో జరిగే దివ్య సత్సంగ్‌లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారని చెప్పారు.

    ప్రపంచంలో నేడు శాంతి, సహనం, నైతికత కొరవడిన నేపథ్యంపై గురూజీ ప్రసంగం సాగుతుందని వివరించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 60 వేల మంది భక్తులు రానున్నట్లు పేర్కొన్నారు.

    వివరణ:

    ఈపొద్దు = ఈ రోజు

    సందకాడ = సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య సమయం

    చదవండి :  పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *