ఆంటోనికి నోరు లేదు, దిగ్విజయ్‌ తెలియనోడు

వారు సీఎం కావాలనుకుంటే 20ఏళ్ళపాటో, అంతకుమించో సీఎంగా పెట్టుకోవచ్చు

రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, ప్రాజెక్టు లు అన్నీ పూర్తిచేయాలని మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి కోరారు.రాష్ట్ర విభజనతో ఉడుకుతున్న సీమాంధ్రలో మంటలార్పే ప్రయత్నంతో కేంద్రం ప్రకటించిన కమిటీతో సీమాంధ్రకు అన్యా యం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ కమిటీలో ఆంటోనికి నో రు లేదని, దిగ్విజయ్‌సింగ్ తెలిసినవాడు కాదన్నారు. శుక్రవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కమిటీని నమ్ముకుంటే నష్టపోక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి :  గైర్హాజరుపై వైకాపా నేతల వివరణ

కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కలిసి వుం టేనే లాభం చేకూరుతుందని, విడిపో తే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సోనియాకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. విభజన దేశానికి కూడా మంచిది కాద ని, ప్రధాన మన్మోహన్ అబ్జర్వర్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నారన్నారు.

రాష్ట్రాన్ని యదాతధంగా వుంచితే సోనియా పరువు ఎక్కడికీ పోదన్నా రు. జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో రాష్ట్రాల విభజనపై ఒక కమిషన్ వేశారని, ఈ కమిషన్ అప్పట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవడాన్ని సూచించిందన్నారు.

చదవండి :  రాజగోపాల్‌రెడ్డి పెద్దకర్మకు ముఖ్యమంత్రి

అయితే అందుకు భిన్నంగా తెలుగురాష్ట్రాన్ని విడదీయడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక 60ఏళ్ళలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

అప్పట్లో రాష్ట్ర బడ్జెట్ 200 కోట్లు ఉంటే ఇప్పుడు 1.50లక్షల కోట్లకు చేరిందని తెలిపా రు. ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, రెండుకోట్ల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన ఎందుకని, ఎవరు చెబితే చేశారని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ వారు సీఎం కావాలనుకుంటే జైపాల్‌రెడ్డి లాంటివారిని 20ఏళ్ళపాటో, అంతకుమించో సీఎంగా పెట్టుకోవచ్చునని, రాష్ట్రాన్ని విడదీయడం సరికాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాక దీనిని తీసుకెళ్ళి తెలంగాణ వారికి ఇస్తామంటే ఎవరై నా అభ్యంతరం చేయకతప్పదన్నారు

చదవండి :  కడప జిల్లాకు చంద్రబాబు హామీలు

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: