శనివారం , 7 డిసెంబర్ 2024

అమ్మాయిలను విక్రయించే ముఠా గుట్టు రట్టు !

మైదుకూరు : ప్రేమ పేరుతో నయవంచన చేసి అమ్మాయిలను ముంబై,పూణేలకు తరలించి అమ్మకం చేసే నల్గురు ముఠా సభ్యులపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మైదుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుకుంటున్న విద్యార్థిని ముంబైకి తరలిస్తూ పట్టుబడిన కేసులో మైదుకూరుకు చెందిన గడ్డం జగన్, వారి తల్లి సారమ్మ, రాయచోటి ఏరియా నీలం కంఠ్రావుపేటకు చెందిన దిల్‌షర్, అమాన్ అనే భార్యభర్తలపై బుధ వారం సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. ఆర్ధరాత్రి మైదుకూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట పోలీసులు జగన్‌ను హాజరు పరచగా ఈనెల 24 వరకు రిమాండ్‌కు ఆదేశించారు.

ముఠాలోని మిగిలిన ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థిని వివరాలమేరకు.. మైదుకూరులోని ఉన్నత పాఠశాలకు వాలీబాల్ ఆడుతూ అమ్మాయిలతో సన్నిహితంగా మెలిగేవాడు. తనకు క్రికెట్‌లో ప్రావీణ్యం ఉందని, ముంబాయిలో క్రికెట్ ఆడితే నెలకు రూ.లక్ష ఇస్తారని, అక్కడికి వెళ్తున్నానని, మీరు అక్కడికి వస్తే వాలీబాల్ ఆటలో మంచి ప్రతిభ చూపుతారని జగన్, అతని తల్లి విద్యార్థిని నమ్మించారు. వారి మాటలు నమ్మి ఇంట్లో రూ.6వేలు డబ్బులు తీసుకుని ఆగస్టు ఒకటిన సోమవారం జగన్‌కు ఇంటికి వెళ్లింది. నీతో పాటు ఇంకొందరు అమ్మాయిలు వస్తున్నారని,సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండమని జగన్ అమ్మ సాలమ్మ చెప్పింది.

చదవండి :  దేవుని కడప బ్రహ్మోత్సవంలో ఈ రోజు

సాయంత్రంకు మిగతా అమ్మాయిలు రాకపోవడంతో మీరు వెళ్లి రాయచోటిలో ఉం డండని, నేను ఆ అమ్మాయిలను తీసుకువస్తానని సాలమ్మ చెప్పి జగన్‌తో ఆ విద్యార్థిని పంి పంచేసింది. ఆటోలో బస్టాండు చేరుకుని అక్కడ నుండి గువ్వలచెరువు వద్దకు వెళ్లగా అక్కడ ముఠాలోని మరో సభ్యుడు అమర్ ఆటో తీసుకుని రావడంతో అందులో ఎక్కి నీలంకంఠాపురం చేరారు. అమీర్, దిల్‌షర్ వారికి ఆశ్రయం ఇచ్చారు. రెండు రోజుల తర్వాత సాలమ్మ అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయిలు రెండు రోజుల్లో ఇక్కడి వస్తారు వేచి ఉందామని చెప్పి అక్కడే శుక్రవారం వరకు ఉంచారు.

చదవండి :  కె.వి.సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్నారు

ఆరోజు రాత్రి పోలీసులు వస్తుండటం గమనించి విద్యార్థినిని తీసుకుని పరారయ్యారు. గుట్టల వెంబడి నడిపించుకుంటూ రాయచోటికి చేరి విద్యార్థికి చెందిన రింగు, కమ్మలు అమ్మి ఆ డబ్బుతో అనంతపురం వెళ్లారు. అక్కడ డబ్బు అవసరమై విద్యార్థిని కాళ్లల్లో గొలుసులు అమ్మారు. అక్కడ నుండి గుంతకల్లు తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలోని దర్గా వద్ద ఉంచి సాలమ్మ, జగన్‌లు ముంబాయికి చెందిన వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతుండగా విద్యార్థిని తనను అమ్మేందుకు ముంబాయికి తీసుకెళ్తున్నారని గ్రహించింది. తను ఇంటికి వెళ్తానని ఏడ్చేసింది. దీంతో తమగుట్టు రట్టు అవుతుందనే ఉద్దేశ్యంతో జగన్ అమ్మ సాలమ్మ వంటిపై కిరోసిన్ పోసుకుంది. కాల్చుకుని మీ వాళ్లపై చంపినట్లు కేసు పెడతానని భయపెట్టింది.

చదవండి :  మార్చి 5,6 తేదీల్లో అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగజాతర

దీంతో భయపడిన విద్యార్థిని ఇక మిన్నకుండిపోయింది. తనకు డబ్బు అవసరమని గుంతకల్లులోని తన బంధువులింటికి వెళ్లి తీసుకువస్తానని సాలమ్మ , దర్గావద్దనే విద్యార్థిని వద్ద జగన్‌ను కాపలా పెట్టి వెళ్లింది ఆదివారం రాత్రి వరకు దర్గా వద్దనే జగన్, బాధిత విద్యార్థిని ఉండిపోయారు. జగన్ దృష్టిని మళ్లించిన విద్యార్థిని తన తండ్రికి రూపాయి ఫోన్ ద్వారా తను ఉన్న చోటు గురించి తెలియజెప్పింది. ఇంతలో తన తండ్రి, బంధువులు పోలీసులను తీసుకురావడంతో ముఠా సభ్యులనుండి బయట పడింది.

ఇదీ చదవండి!

మనువు

మనువు (కథ) – సొదుం జయరాం

సొదుం జయరాం కథ ‘మనువు’ ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది. నిజానికి ఆ ఇంట్లో అంతగా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: