అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

చక్రాయపేట : రంగస్థల నాటక రంగంలో విభిన్న పాత్ర పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న కళాకారుడు వెంకటకృష్ణయ్య ఇకలేరు. రంగస్థలంపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు వెంకటకృష్ణయ్య మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. నాగులగుట్టపల్లెలో నివాసముంటున్న నటుడు వెంకటకృష్ణయ్య బుధవారం కన్నుమూశాడు.

పౌరాణిక, సాంఘిక ఘట్టాలలో పలు వైవిధ్యభరతమైన పాత్రలు పోషించిన వెంకటకృష్ణయ్య స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె. 1953లో కృష్ణయ్య విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా 1975దశకంలో రికార్డు అసిస్టెంట్‌గా చిట్వేల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో చేరారు. అటు నుంచి మట్లి, లక్కిరెడ్డిపల్లె, నాగులగుట్టపల్లె, చాకిబండ, పాములూరు, చక్రాయపేట, పులివెందుల, వేంపల్లెలలో వెంకటకృష్ణయ్య ఉద్యోగ రీత్యా విధులు నిర్వహించారు.

చదవండి :  నేడు దేవుని కడపలో కోయిల్ఆళ్వార్ తిరుమంజనం

పదవీ విరమణ అనంతరం ఆయన నాగులగుట్టపల్లెలో స్థిరనివాసముంటున్నారు. ఈయన రెండు దశాబ్దాల కాలం పాటు సురభి నాటక రంగానికి ఎనలేని కృషి చేశారు.

బాలనాగమ్మలో చాకలి తిప్పడు, సత్యహరిశ్చంద్రలో కాలకౌశికుడు, చింతామణిలో సుబ్బిశెట్టి, తారాశశాంకం, బ్రహ్మగారి జీవిత చరిత్రలో చాకలి తిప్పడు వంటి నాటకాల్లో వివిధ రకాల వైవిద్యమైన పాత్రలు పోషించి, నాటక రంగానికి జీవం పోశారు. ఈయన మృతి కళారంగానికి తీరని లోటని పలువురు కళాకారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

చదవండి :  కిడ్నాపైన కాంట్రాక్టర్ విడుదల

ఇదీ చదవండి!

ప్రాణుల పేర్లు

కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: