ముగిసిన అనంతపురం గంగ జాతర

అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర సోమవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. శనివారం తెల్లవారు జామున అనంతపురం గంగమ్మ ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం కుర్నూతల గంగమ్మ ఆలయానికి రాగానే నిండు తిరునాళ్ల ప్రారంభమైంది. సోమవారం మైల తిరునాళ్ల నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించి, జాతర నిర్వహణ ముసిగిందని ప్రకటించారు. గత మూడు రోజుల పాటు అనంతపురం గ్రామం జనసంద్రంగా మారింది. గంగస్నానాలతో జాతర ముగింపు వేడుకలను నిర్వహించారు. చాగలగట్టుపల్లె గంగమ్మ దేవత, గొల్లపల్లె గంగమ్మ దేవతలు స్వస్థలాలకు చేరుకున్నారు.

చదవండి :  కడప జిల్లాలో నిజాం మనువడి హత్య

ఆదివారం రాత్రి గంగమ్మ జాతర ప్రాంగణం విద్యుత్ దీపాలతో శోభాయమానంగా కనిపించింది. వివిధ రకాల పూలతో అలంకరించిన అమ్మవారు నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మొక్కుబడి కోసం నిర్మించిన చాందినీబండ్లు, విద్యుత్‌దీపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు వీనులవిందు చేశాయి.

అమ్మవారిని ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత తెనాలి కళాకారులు ముందు నడుస్తుండగా కన్నుల పండువుగా ఊరేగించారు. ఆదివారం రాత్రి శ్రీ మన్నారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. శివపార్వతుల నృత్యాలు, నరసింహస్వామి అవతారం, గంగమ్మ తల్లి, కనకదుర్గమ్మ దేవతల నాట్య హేళ, వినాయకుని, షిరిడీసాయినాధుని వేషధారణలతో పాటు వేసిన నాటకాలు భక్తులను పరవశింప చేశాయి.

చదవండి :  సీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాల

రెండు రోజుల పాటు నిరాటంకంగా అన్నదానం కూడా చేశారు. పోటీలు పడి ఏర్పాటు చేసిన పండరి భజనల కార్యక్రమం భక్తులను ఉర్రూతలూగించింది.

పులివెందుల డీఎస్పీ హరినాధబాబు జాతర ప్రాంగణం మొత్తం రాత్రంతా కలియతిరుగుతూ బందోబస్తును పర్యవేక్షించారు. కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలతో మండల స్థాయి అధికారులు, ప్రత్యేకాధికారి జాతర ప్రాంగణంలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు జాతరలో జరిగే పరిస్థితులను జిల్లా యంత్రాంగానికి తెలియజేశారు.

అనంతపురం గంగ జాతర ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఇదీ చదవండి!

go34

సూక్ష్మ సేద్య రాయితీలలోనూ కడప, కర్నూలులపై ప్రభుత్వ వివక్ష

సూక్ష్మ సేద్య పరికరాల (స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు మొదలైనవి) కొనుగోలు సబ్సిడీ విషయంలోనూ కడప, కర్నూలు జిల్లాలపై తెదేపా ప్రభుత్వం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: