అది మూర్ఖత్వం

రాష్ట్ర విభజన వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో అనేక వివాదాలు ఏర్పడతాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఏకైక పరిష్కారమని శనివారం స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్‌లో ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షతన ‘‘రాష్ట్ర విభజన- జల వివాదాలు’’ అనే అంశంపై ఏపీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.

రాయల తెలంగాణతో ….

mysuraరాయలసీమలోని తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, తెలంగాణలో ని నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమ ప్రాజెక్టులకు నికర జలాలు లభించవు. ఇప్పటికే సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చుచేసి 70 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టులు విభజన వల్ల నిరర్థకంగా మా రుతాయి. మిగులు జలాల పంపిణీపై పరిష్కార ఒప్పందాలు చేసుకోవడానికి అ వకాశం ఉండదు. శ్రీశైలం, జురాల, నాగార్జున సాగర్‌లు అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులుగా మారుతాయి. విభజన తర్వాత ఏర్పాటయ్యే బోర్డు ట్రిబ్యూనల్ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు నీరుసక్రమంగా అందించేందుకే పరిమితమవుతుం ది.

మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశం బోర్డు పరిధిలో ఉండదు. తెలంగాణ ఏర్పడితే పోలవరం, దమ్ముగూడెం, సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు నిర్మాణం కావు. రాయల తెలంగాణ వల్ల కూడా చుక్కనీరు అందదు. నీటి సమస్య పరిష్కారం కావాలంటే కృష్ణా నీటిని ఉపయోగించుకొనే 18 జిల్లాలు ఒక రాష్ట్రంగా ఏర్పడాలి. ఇక మిగిలిన ఐదు జిల్లాలు ఏం పాపం చేశా యి. లేదంటే మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను సీమాం ధ్రలో కలపాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలు. శాసనసభ ప్రొరోగ్ కా లేదు గనుక ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సభను సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.

చదవండి :  సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి

– ఎంవి మైసూరారెడ్డి, వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యుడు

అది మూర్ఖత్వం

Lakshmi Narayanaఎస్‌ఆర్‌బీసీ, బీమా, శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు నీటి విడుదల వంటి అంశాల్లో రాష్ర్ట పరిధిలో జరిగిన కేటాయింపులు విభజన తర్వాత వివాదాస్పదంగా మారుతాయి. రాయలసీమ కృష్ణా పరివాహక ప్రాంతంలో లేదని చెప్పడం మూర్ఖత్వం. కృష్ణా జలాల్లో రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న శ్రీబాగ్ ఒప్పందం కాలగర్భంలో కలిసిపోయింది. కృష్ణా- పెన్నా ప్రాజెక్టులు అటకెక్కించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తామని చెప్పిన సిద్దేశ్వరం గాలిలో కలిసిపోయింది. బళ్లారిని రాయలసీమ వాసులు కోల్పోయారు. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ అన్యాయంగా తీర్పు ఇచ్చింది. నికర జలాలను మాత్రమే పంపిణీ చేసి మిగులు జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలి. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానమే సాగునీటి సమస్యకు పరిష్కారం.

చదవండి :  రేపు రాయలసీమ మహాసభ సమావేశం

-టి.లక్ష్మినారాయణ, డెరైక్టర్, నీలం రాజశేఖరరెడ్డి రీసెర్చ్ సెంటర్.

దక్కకుండా పోతాయి

Prabhaar Reddyతెలంగాణ వాసులు ఇప్పటికే పోలవరం ప్రా జెక్టుకు అడ్డు చెబుతున్నారు. ఇక రాష్ట్రమే విడిపోతే ఆ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయి సీమకు అందాల్సిన నికర జలాలు దక్కకుండా పోతాయి. భద్రాచలాన్ని వదులుకుంటే గోదావరిపై హక్కే కోల్పోతాం. విభజన జరిగితే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజి నిండిన తర్వాతగానీ మనకు నీరు అందదు. తెలంగాణలోని బీమా ప్రాజెక్టుకు కూడా 20 టీఎంసీల నికర జలాలు లభించవు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను కోసం సాగర్ నుంచి ఇస్తున్న 12 టీఎంసీల నీటిని ఎవరు భరించాలో తేల్చాల్సి ఉంటుంది. కేసీ కెనాల్‌కు శ్రీశైలం నుంచి నీటి విడుదలకు అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఇలాంటి జల వివాదాలు ఏర్పడవు.

– ప్రభాకర్‌రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు

ముందే పరిష్కరించాలి

CH Chandrasekharరాష్ట్రంలోని ఎనిమిది కరువు జిల్లాల కోసం మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులకు చుక్కనీరు లభించదు. ట్రిబ్యునల్స్, రివర్ వ్యాలీ అథారిటీలు ఈసమస్యను పరిష్కరించలేవు. దీనికి పరి ష్కారమేదైనా ఉంటేసమైక్య రాష్ట్రం లోనే జరగాలి. విభజిస్తామంటే సీమ పరిస్థితి ఏమిటి?. రాష్ట్ర విభజనకు ముందే నికర జలాల కేటాయింపు సమస్యను పరిష్కరించాలి.

చదవండి :  సీమ ప్రాజెక్టులకు శానా తక్కువ నిధులు కేటాయించినారు

– సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి

ఉపయోగపడని సీమ ముఖ్యమంత్రులు

lingareddyరాయలసీమలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరముంటుంది. నికర జలాలు అందకపోతే ఇవి ఎందుకు కొరగాకుండా పోతాయి. కృష్ణా మిగులు జలాలను బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయడం వల్ల మనం నష్టపోయాం. సీమ వాసులే ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ ఇక్కడ కరువు, దారిద్య్రం పోలేదు. పో లవరం ప్రాజెక్టును తెలంగాణా నేతలు వ్యతిరేకించడంలో అర్థంలేదు. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు అన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ నుంచే అధికంగా వస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఖాళీచేసి వెళ్ళాలనడం దారుణం.

-ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు.

మైలవరానికి మట్టే!

Adiinarayana reddyరానున్న ఎన్నికల్లో సమైక్యవాదులను ప్రజలు గెలిపిం చాలి. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే జల వివాదాలు ఏర్పడవు. ఇప్పటికే తుంగభద్ర నుంచి సీబీఆర్‌కు, మైలవరానికి నీరు రావడం లేదు. రాష్ట్ర విభజనే జరిగితే మిగులు జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు నిరుపయోగమవుతాయి. అన్ని పార్టీలు సమైక్యాంధ్ర కోసం పాటుపడాలి. గంగా-కావేరి అనుసంధాన కార్యక్రమం జరగాలి.

-ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే, జమ్మలమడుగు

ఇదీ చదవండి!

దూరి సూడు

దూరి సూడు దుర్గం సూడు మామా – జానపదగీతం

దూరి సూడు దుర్గం సూడు మామా దున్నపోతుల జాడ జూడు మైలవరమూ కట్టా మీద మామా కన్నె పడుచుల బేరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: