
అదిగాక నిజమతం బదిగాక యాజకం- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అదిగాక నిజమతం బదిగాక యాజకం- బదిగాక హృదయసుఖ మదిగాక పరము ॥చ1॥ అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు- నమరినది సంకల్పమను మహపశువు ప్రమదమను యూపగంబమున విశసింపించి విమలేందు యాహుతులు వేల్పంగవలదా ॥చ2॥ అరయ నిర్మమకార మాచార్యుఁడై చెలఁగ వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాఁగ దొరకొన్న శమదమాదులు దానధైర్యభా- స్వరగుణాదులు విప్రసమితి గావలదా ॥చ3॥ తిరువేంకటాచలాధిపునిజధ్యానంబు నరులకును సోమపానంబు గావలదా పరగ నాతని కృపాపరిపూర్ణ జలదిలో నరుహులై యవబృథం బాడంగవలదా |
రాగము: శ్రీరాగం రేకు: 0006-05 సంపుటము: 1-40 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం