
హరినెఱఁగనిపుణ్య మంటేరుగాన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ హరినెఱఁగనిపుణ్య మంటేరుగాన దురితాలే దురితాలే దురితాలే సుండీ read ॥చ1॥ దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలు అడ్డగించుకొని రాసులగుగురుతు జడ్డులేనిహారికధ చవిలేకుండిన నిట్టే గొడ్డేరే గొడ్డేరే గొడ్డేరే సుండీ ॥చ2॥ వలేనని మేలేల్ల వడిఁజేసి కైవల్య- మలమి చేతికిలోననగు గురుతు తలఁపు వైష్ణవభక్తిఁ దగులకుండిన నంతా అలయికే అలయికే అలయికే సుండీ ॥చ3॥ తిరమైన తీర్ధాలు దిరిగి యందరిలోన ధరఁ బుణ్యఁడవుట యంతకు గురుతు తిరువేంకటపతిఁ దెలియకుండిన నంతా విరసాలే విరసాలే విరసాలే సుండీ |
రాగము: ఆహిరి రేకు: 0035-06 సంపుటము: 1-219 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి