హమ్మయ్య… వానొచ్చింది

హమ్మయ్య… వానొచ్చింది

కడప: చాలా రోజుల తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాలలో మాంచి వాన కురిసింది. బేస్తవారం  అర్థరాత్రి నుంచి కురుస్తున్న వానకు తూములు దునికి నీళ్ళు వీధుల వెంబడి ప్రవహించాయి.

కడప నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. జిల్లలో పలు  చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముద్దనూరులో కురుస్తోన్న భారీ వర్షానికి కాయలవంక, పుల్లేరు వంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఈ వాన కారణంగా ప్రజలకు తాగునీటి సమస్యల నుండి కొంతమేర ఉపశమనం  కలగనుంది. పొలతల క్షేత్రంలో వానకోసమని బేస్తవారం పగలు వరుణయాగం చెయ్యగా రాత్రికి వాన రావడం(సైన్సు రీత్యా కాకతాలీయమే అయినా) విశేషంగా ఉంది.

చదవండి :  సిటీబస్సుల కోసం కడపలో మరో వాహనశాల

మొత్తానికి ఈ వానతో జిల్లా ప్రజలకు తాగునీటి ఇక్కట్ల నుండి ఉపశమనం దక్కగా… రైతులకు పంటల సాగు మీద ఆశలు చిగురిస్తున్నాయి.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *