తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి.

బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, రాజంపేట, నందలూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట, వీరబల్లి, చిట్వేలి, టి.సుండుపల్లె, రైల్వేకోడూరు, పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె, రాయచోటి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

చదవండి :  ఒంటిమిట్టలో కృష్ణంరాజు

పల్లెతీర్పు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడనుంది. దీంతో ఎన్నికలను రాజకీయ పక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

1088 పోలింగ్ కేంద్రాలు

ఎన్నికలకు అధికారులు 1088 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5480 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. పోలింగ్ అధికారులు 1088 మంది, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 1088, ఓపిఓలు 32,064 మంది విధుల్లో పాల్గొంటున్నారు.

సమస్యాత్మక కేంద్రాలపై గురి

519 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక, 307 కేంద్రాలను సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు 10, ట్రబుల్ కేంద్రాలుగా 77 గుర్తించారు. అవకాశం ఉన్న అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 107 చోట్ల వెబ్‌టెలికాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. 722 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల కనుసన్నల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

చదవండి :  కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా - 2019

బందోబస్తు

ప్రశాంత ఎన్నికలు నిర్వహణ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 4300 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 177 మొబైల్ పార్టీలు, 58 స్ట్రైకిగ్, 29 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియమించారు. రెండు, మూడు మండలాలకు కలిపి ఒక డీఎస్పీని నియమించారు.

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: