సొరిది సంసారంబు సుఖమా యిందరికి – అన్నమయ్య సంకీర్తన

సొరిది సంసారంబు సుఖమా యిందరికి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సొరిది సంసారంబు సుఖమా యిందరికి
వెరవెఱంగక వగల వేఁగేరు గాక
॥చ1॥
దేహములు దలఁప సుస్థిరములా ప్రాణులకు-
నూహింప లోభ మట్లుండుఁ గాక
మోహంబుచే వెనకముందెఱుఁగలేక తమ-
దేహసుఖములు మరిగి తిరిగేరుగాక
॥చ2॥
నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికి
అలవి నిలుపఁగరాని యాస గాక
బలువైన వట్టి విభ్రాంతిచే దగులువడి
తెలిసియును దెలియ కిటు తిరిగేరు గాక
॥చ3॥
నెఱయువిభవములెల్ల నిజములా యిందరికి
కొఱమాలినట్టి తమగుణముగాక
యెఱుకతోఁ దిరువేంకటేశుఁ గొలువఁగలేక
తెఱఁగుమాలిన బుద్ధిఁ దిరిగేరుగాక
రాగము: ముఖారి
రేకు: 0040-06
సంపుటము: 1-248

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *