సేవింతురా యితనిఁ జెలఁగి పరు లిట్లనే – అన్నమయ్య సంకీర్తన

సేవింతురా యితనిఁ జెలఁగి పరు లిట్లనే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సేవింతురా యితనిఁ జెలఁగి పరు లిట్లనే
కావించె మమ్ము నెక్కడి దైవమితఁడు
॥చ1॥
పాలచవి యితఁడెఱుఁగు పాలఁబవళించ గో-
పాలుఁడని నేమితని భజియించఁగా
పాలుపడి తల్లి చనుఁబాలు సహితంబు నే-
కాలమునుఁ బాపె నెక్కడి దైవమితఁడు
॥చ2॥
పుట్టిపఁ దానె మఱి పురుషోత్తముఁడు మంచి-
పుట్టు వొగీననుచుఁ బూజించఁగా
పట్టుకొని మముఁ దెచ్చి బలిమిఁ బుట్టువులెల్లఁ
గట్టిపెట్టించె నెక్కడి దైవమితఁడు
॥చ3॥
కర్మకర్తారుఁడని కడలేనిపుణ్యముల …
కర్మఫలములు దనకుఁ గైకొలుపఁగా
కర్మగతిఁ దెచ్చి వేంకటవిభుఁడు మావు భయ…..
కర్మములఁ జెరిచె నెక్కడి దైవమితఁడు
రాగము: ముఖారి
రేకు: 0048-01
సంపుటము: 1-293

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  ఎన్నఁగలుగు భూతకోటి నెల్లఁ జేసినట్టిచేఁత

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: