పట్టిసీమతో సీమకు అన్యాయం: రామచంద్రయ్య

పట్టిసీమతో సీమకు అన్యాయం: రామచంద్రయ్య

కడప: పట్టిసీమ నిర్మాణంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. దీన్ని గుర్తించకుండా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత రామచంద్రయ్య ఆరోపించారు.

స్థానిక ఇందిరాభవన్లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పట్టిసీమ గురించి ముఖ్యమంత్రి చెబుతున్న మాట్లల్లో వాస్తవం లేదన్నారు.

పట్టిసీమ నిర్మాణం జరిగితే సీమకు ఎలాంటి ఉపయోగం లేకపోగా శాశ్వత నీటి వనరుగా ఉండాల్సిన పోలవరం సాగునీటి పథకానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోయినా ముఖ్యమంత్రి మొండిగా పట్టిసీమ చేబడుతున్నారన్నారు.

చదవండి :  వరదరాజులురెడ్డి అందుకే దేశంలోకి వచ్చారా!

చంద్రబాబుకు రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్దిలేదని, తన వర్గానికి చెందిన వారికి లబ్ధి చేకూర్చేందుకే ‘పట్టిసీమ’ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన సీఎం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఎందకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

గాలేరు- నగరి, హంద్రీ- నీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: