సోమవారం , 23 డిసెంబర్ 2024
sodum sreekanth

సావైనా బతుకైనా (కవిత) – సొదుం శ్రీకాంత్

రాళ్ళసీమ అంటనారు గదా
రాసుకున్న హామీలపత్రం కూడా ఉంది గదా
అదేదో ఆ సింగపూరన్నా కాలబడి మా ఊరికొచ్చే
బేకారుగా తిరిగే మా పిల్ల నాయాల్లకు
రెండు జీతం పరకలన్నా దొరుకతాయి అని ఆశపడి
రాజధానిని అడుగుదామని పోతే
‘రస్తాలో లేవు పోచ్చాయ్ ……’
రౌడీ నా కొడకా అంటా ఎగిచ్చి తమ్తిరి!

ఉరితాళ్ళు మీ ఇంట యాలాడనప్పుడు
దుక్కిసాల్లు నిన్ను యంటబడి ఏటాడి మట్టుబెట్టనప్పుడు
అవును మరి, కరువు ఎవరికి సేదు?
ఒక్క మా రాయలసీమ తలపాగలకు తప్ప!
ఆ ట్రిబ్యునల్ల కాడ మా అనంతపురాన్ని అడ్డంపెట్టుకుని,
మా కరువు గడ్డ కన్నీళ్లను అడ్డంపెట్టుక తెచ్చిన కృష్ణానీళ్ళను
అయ్యా మా పేరుమీద తెచ్చిన ఆ సాగునీళ్ళల్లో
రోన్ని మా ముఖాన ఇట్ట కొట్టండని ఆశగా అడగబోతే
‘పల్లమేం రా నీది?? గూండా నాకొడకా! ‘ అంటా …
మెట్లతో కొట్టిరి…….కూనికోరని గుండు గీకిచ్చి మెరవని సేచ్చిరి!

చదవండి :  సీమ సినుకయ్యింది - సొదుం శ్రీకాంత్

ఆ ఇడిపోయే టాపొద్దు అదేదో
ప్రత్యేక ప్యాకేజి గిత్యేక ప్యాకేజి అని సెప్తిరి గదా
మరి దాని లెక్కాశారం ఏందో ఇశారిచ్చామని
వచ్చే ఆ రోన్ని నిధుల్ని అన్నా
ముదరసుట్టుకొని మూటగట్టుకొచ్చామనీ
అదీగాక అదేదో జాతి ..జాతి …జాతి …అనీ
ఒగటేమైన ఒగిరిచ్చనారుగదా ఈ మద్దెన
తట్టుకో వాని మూతి ముందరే మాట్లాద్దం అనిపోతే
ఆ నీతి లేని ‘జాతి కుక్క’
సవతి తల్లి బిడ్డల కన్నా కనాగష్టంగా జూసి
నా నోట్లో ఇంత మట్టి కొట్టి
‘సావ్ రా నా కొడకా’ అని మూతి మీద తన్నె!

చదవండి :  కడప.ఇన్ఫో పేరుతో విషం చల్లుతున్నామా?

ఇట్లా రెండు గాదు మూడు గాదు
సెప్పుకుంటా పోతే సవాలచ్చ
ఇడిపోయేటాపొద్దు యాయి తప్పో-ఇయ్యాల అయ్యే రైట్టు
అధికారముంది గదా సేతిలో , వాని రాజ్యం వానిట్టం
అడ్డుతగలాల్సినోల్లేమో, జనం ఘోష పట్టని ‘జఫా’ గాల్లాయ
అసలు మనం మనుసులమైతే గదా, వాళ్ళ లెక్కన!
థూవ్….దీనెయ్య బతుకు!
లోపలంతా ఎవరో రేగిమట్టతో సర్సినట్లనిపించె!
కంపరం పుడ్తాంది తల్సుకుంటేనే
ఇంగేంది వాన్ని దేవురించేది బోడి పుచ్చకా!

సావైనా బతుకైనా ఇక నాకు మిగిలింది ఒక్కటే
అదే ‘జై రాయలసీమ… జై జై రాయలసీమ …. ‘

చదవండి :  అస్థిత్వం - డా.ఎం.వి.మైసూరారెడ్డి

ఇదీ చదవండి!

www.kadapa.info

కడప.ఇన్ఫో పేరుతో విషం చల్లుతున్నామా?

ఇప్పటికి సరిగ్గా పదేళ్ళ కిందట 2006లో కడప.ఇన్ఫో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో కడప.ఇన్ఫోలో కొన్ని వ్యాసాలను/అభిప్రాయాలను ప్రచురించిన నేపధ్యంలో వివిధ …

2 వ్యాఖ్యలు

  1. Gunde ragilinchi ,manasunau melipetti, medadunu alochimpachesina oka manchi kavitha thanaku Srikanth garoo for this inspirational poetry ..

    Jai Rayalaseema .. Joao Jai Rayalaseema ..

  2. అన్నా !మీకవిత లో అచ్చరం అచ్చరం కంకులు కోచ్చండ్ల కోదేలి పడునున్నట్టుండై సీమలో జనం అగ్గైమందక పోతర…. జై రాయలసీమ అని అరసకపోతర …నయవంచక నాయకులకు కాలం మూడిందిలే …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: