
సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త- మొకటికినిఁ జొరదు విధియోగమౌఁగాదో ॥చ1॥ దొరతనంబట కలిమి దోడుగాదట మంచి- తరుణులట మోహమట దైన్యంబట విరహమట దారిద్య్రవివశుఁడౌనట చూడ నరయ నిది కర్మఫలమౌనో కాదో ॥చ2॥ రాజసన్మానమట రవణహీనత్వమట తేజమట నలువంకఁ దిరిపెంబట వాజివాహనములట వాఁడి లేదట తొంటి- పూజఫలమిది వెలితిభోగమౌఁగాదో ॥చ3॥ యిలయెల్ల నేలునట ఇంట లేదట మిగుల బలిమిగలదట సదా పరిభవమట చెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరుని గొలువనేరనివెనకఁ గొరఁతలౌఁగాదో |
రాగము: శ్రీరాగం రేకు: 0040-05 సంపుటము: 1-247 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం