శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణా

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణా

॥పల్లవి॥
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణా
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
voltaren végbélkúp
voltaren szemcsepp
॥చ1॥
కమలాసతీ ముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణా
కమలాసనహిత గరుడగమన శ్రీ-
కమలనాభ నీపదకమలమే శరణు
॥చ2॥
పరమయోగిజనభాగధేయ శ్రీ-
పరమపూరుషా పరాత్పరా
పరమాతుమ పరమాణురూప శ్రీ-
తిరువేంకటగిరిదేవ శరణు
రాగము: మాళవి
రేకు: 0025-07
సంపుటము: 1-155

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, మాళవి

చదవండి :  తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమ

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *