ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డి

    ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డి

    కడప : సీనియర్ జర్నలిస్టు, కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

    శ్రీనాథ్‌రెడ్డి సుదీర్ఘ కాలం 28 సంవత్సరాల పాటు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. 2014 నుంచి సాక్షి పొలిటికల్ సెల్‌కు సలహాదారులుగా పని చేశారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీయు డబ్ల్యుజేలో వివిధ హోదాల్లో పని చేశారు. రాయలసీమ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మరో నేత ఎంవీ మైసూరారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డితో కలసి రాయలసీమ సమస్యలపై శ్రీనాథ్‌రెడ్డి ఉద్యమించారు. శ్రీనాథ్‌రెడ్డి సొంత ఊరు పులివెందుల మండలం కోవరంగుట్టపల్లె గ్రామం.

    చదవండి :  బొత్సతో కందుల సోదరుల చర్చ

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *