
వెలికీ వెళ్ళఁడు చలికీ వెరవఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ వెలికీ వెళ్ళఁడు చలికీ వెరవఁడు వులికీ నులికీ నులికీనయ్యా ॥చ1॥ రోగియై తా రుచులఁ బాయఁడు భోగియై రతిపొందల్లఁడు వేగి మిగిలిన వెడచీఁకటినీరు తాగీఁ దాగీఁ దాగీనయ్యా ॥చ2॥ తొడికీఁ దొడుకఁడు వుడికీ నుడుకఁడు కడికీఁ గసరఁడు కడుఁజేరఁడు మడికీ గుడికీ మానిన మమతలఁ బుడికీఁ బుడికీఁ బుడికీనయ్యా ॥చ3॥ నిండీ నిండఁడు నెరసీ నెరయఁడు పండీఁ బండఁడు బయలీఁతలా అండనె తిరువేంకటాధిపుఁ దలఁపుచు నుండీ నుండీ నుండీనయ్యా |
రాగము: కన్నడగౌళ రేకు: 0061-04 సంపుటము: 1-313 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ