వీనిఁ జూచియైన నేము విరతిఁబొందగలేము – అన్నమయ్య సంకీర్తన

వీనిఁ జూచియైన నేము విరతిఁబొందగలేము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
వీనిఁ జూచియైన నేము విరతిఁబొందగలేము
పూని మాబ్రదు కిందుఁబోలదాయఁగా
॥చ1॥
పరుల వేడఁగబోవు పరనిందకుఁ జొరవు
పరపురుషార్థమే ఫలవృక్షతతులెల్ల
నరులమై ఘనులమై నానాబుద్ధు లెఱిఁగి
పొరి మాబ్రదుకు లిందుఁబోలదాయఁగా
॥చ2॥
కామక్రోధాదులు లేవు కామతత్వ మెఱఁగవు
కామించినట్లవు నెక్కడనైనా శిల లివి
దీమసము గలిగియుఁ దెలివి గలిగియును
భూమిలో మాబ్రదు కిందుఁబోలదాయఁగా
॥చ3॥
వొకరిఁ గొలువఁబోవు వొకపంట సేయఁబోవు
వొకమానిగడు చేరివుండు పక్షు లాడనాడ
వొక శ్రీ వేంకటపతి నమ్మియుండలేము
మొకెమో మాబ్రదు కిందుఁబోలదాయఁగా
రాగము: దేసాళం
రేకు: 0081-01
సంపుటము: 1-388

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాళం

చదవండి :  ఇరవగువారికి యిహపర మిదియే - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: