
విధి నిషేధము లకు వెఱవఁగఁ బనిలేదు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ విధి నిషేధము లకు వెఱవఁగఁ బనిలేదు మధుసూదన నీమన్నన దాసుడైతే ॥చ1॥ విడువరానిధర్మ విధుల పురుషులను విడిచి గోపికలు విచ్చనవిడి బడి నిన్ను దగులుటే పరమధర్మ మాయ యెడయునితర ధర్మాలిక నేటికయ్యా ॥చ2॥ మానరాని కర్మమార్గము లటు మాని పూనినయతులే పూజ్యులట నీనారాయణనియతే ధర్మమాయ యీనిజ మొకటియు నెఱగఁగఁవలయు ॥చ3॥ యిన్నిట శ్రీవేంకటేశ నీదాసుఁడై వున్న విచారాల నొదుగనేలా నిన్ను గూర్చినట్టి నిజభ క్తి గలదని తిన్ననై తెలిపేటి తెలివే కలది |
రాగము: దేవగాంధారి రేకు: 0082-01 సంపుటము: 1-393 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి