
వలవని మోహావస్థలఁ బొరలెడి –
॥పల్లవి॥ వలవని మోహావస్థలఁ బొరలెడి – మలినం బెన్నఁడు మానును – ॥చ1॥ ఘెరదురితవికారంబుల కారణ మెన్నఁడు దీరును వైరముగొని తనువదలనిబంధపు – భారం బెన్నఁడు వాయును ॥చ2॥ జడమగుజిహ్వచాపల్యముగల – వెడమతి యెన్నండు వీడును చెడనిజీవునకు శ్రీవేంకటపతి- కడుచూ పెన్నఁడు గటుగును |
రాగము: లలిత రేకు: 0028-06 సంపుటము: 1-174 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలిత