సోమవారం , 23 డిసెంబర్ 2024

రుణమాఫీ కాలేదని బ్యాంకు గేట్లు మూసిన రైతులు

భాకరాపేట: రుణమాఫీ కాలేదని సిద్దవటం మండలంలోని భాకరాపేట భారతీయస్టేట్‌బ్యాంకు గేట్లు మూసివేసి సోమవారం ఉదయం రైతులు ఆందోళన చేశారు. ఇక్కడి బ్యాంకు శాఖలో దాదాపు 2728 మంది రైతులు పంట రుణాలు తీసుకోగా ఒక్కరికి కూడా మాఫీ కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్యాంకు నుండి రుణాలు తీసుకున్న బొగ్గిడివారిపల్లె, పెద్దపల్లె, మేఘనాపురం పంచాయతీల పరిధిలో ఉన్న దాదాపు వంద మంది రైతులు బ్యాంకు వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికార సిబ్బందిని బయటకు పంపి గేటు మూసివేశారు.

చదవండి :  కడప- చిత్తూరు జిల్లాల సరిహద్దులో బయటపడ్డ మందు పాతరలు

దాదాపు గంట పాటు ఆందోళన చేయగా పోలీసులు వచ్చి సర్ది చెపారు. బ్యాంకు మేనేజరు మాట్లాడుతూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరింపజేస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.

ఇంతవరకూ రుణమాఫీ చేసేశాం అని మైకుల ముందు ఊదరగొట్టిన నేతలు వీరికి ఏం సమాధానం చెబుతారో?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: