
రాముఁడిదే లోకాభిరాముఁ డితఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ రాముఁడిదే లోకాభిరాముఁ డితఁడు గోమున పరశురాముకోప మార్చెనటరే ॥చ1॥ యీతఁడా తాటకిఁ జించె యీపిన్నవాడా ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె చేతనే యీకొమరుఁడా శివునివిల్లు విఱిచె సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త గదవె ॥చ2॥ మనకౌసల్యకొడుకా మాయమృగము నేసె దనుజుల విరాధుని తానే చెఱిచె తనుమాడె నేడుదాళ్లు తోడనే వాలి నడఁచె యినకులుఁ డితఁడా యెంతకొత్త చూడరే ॥చ3॥ యీవయసుతానే యాయెక్కువజలధి గట్టి రావణు జంపి సీత మరలఁ దెచ్చెను శ్రీవేంకటేశుఁ డితఁడా సిరుల నయోధ్య యేలె కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే |
రాగము: సాళంగనాట రేకు: 0095-04 సంపుటము: 1-474 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట