గండికోట శ్రీరామచంద్రుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన
విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటను చేరిన ‘పదకవితా పితామహుడు’ అక్కడి రాముని సేవించి తరించినాడు. గండికోట శ్రీరామచంద్రునికి అన్నమయ్య సమర్పించిన సంకీర్తనా నీరాజనమిది….
వర్గం : శృంగార సంకీర్తన
కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు)
రాగం: దేవగాంధారి
‘రాజవు నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.
పల్లవి: రాజవు నీకెదురేదీ రామచంద్ర
రాజీవ నయనుడ రామచంద్ర
చరణం: వెట్టిగాదు నీవలపు వింటి నారికి దెచ్చితిని
(ర)ఱట్టు సేయ బనిలేదు ఇట్టే రామచంద్ర
గుట్టుతోడ జలనిధిపై గొండలు ముడివేసితి
మెట్టు మరవగ వచ్చునివి రామచంద్ర ||రాజవు ||
చరణం: బతిమి తోడుత బైడి పతియె గైకొంటి
రతికెక్కె నీ చలము రామచంద్ర
మితిమీరి జవ్వనము మీదు కట్టితివి నాకై
ఇతరులేమనగలరిక రామచంద్ర ||రాజవు ||
చరణం: నావంటి సీతను నాగేటి కొన దెచ్చితి
రావాడి తమకముతో రామచంద్ర
ఈ వేళ శ్రీ వేంకటాద్రి నిరవై నన్ను గూడితి
చేవదేర గండికోట శ్రీరామచంద్ర ||రాజవు ||
‘రాజవు (పు) నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.