2014 సార్వత్రిక ఎన్నికలలో రాజంపేట శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 20 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. రాజంపేట శాసనసభ స్థానం నుండి తెదేపా మరియు భాజపాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా మల్లిఖార్జున రెడ్డి గెలుపొందారు.
రాజంపేట శాసనసభ స్థానంలో ఆయా అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి …
మేడా మల్లిఖార్జున రెడ్డి – తెదేపా + భాజపా – 83884
ఆకేపాటి అమర్నాద్ రెడ్డి – వైకాపా – 72267
గాజుల భాస్కర్ – కాంగ్రెస్ – 2362
అంకిరెడ్డి అమర్నాద్ రెడ్డి – జై మహాభారత్ పార్టీ – 999
కే అయ్యవారయ్య – బసపా – 498
ఏ చంద్రమోహన్ – లోక్ జనశక్తి – 482
DR. సి చంద్రశేఖర్ యాదవ్ – లోక్ సత్తా – 442
ఆర్ రమేష్ బాబు – నేకాపా – 439
షేక్ మౌలానా – జైసపా – 392
DR. ఎం.రవి నాయక్ – పిరమిడ్ పార్టీ – 371
పి ప్రదీప్ – రాయలసీమ పరిరక్షణ సమితి – 198
వి సురేష్ కుమార్ – ఆం ఆద్మీ – 159
షేక్ హిదయతుల్లా – జెడియు – 88
నోటా – 584
స్వతంత్ర అభ్యర్థులు (7గురు) – 2167